భారతదేశం, నవంబర్ 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు సహజంగా ఏర్పడటం చూస్తూ ఉంటాం. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. రాహువుని చెడు గ్రహం అని అంటారు. రాహువు మంచి స్థానంలో ఉన్నట్లయితే, ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారు రాహువు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ, సంతోషంగా కూడా ఉంటారు.

రాహువు డిసెంబర్ 2 మంగళవారం తెల్లవారుజామున 2:15కు శతభిష నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే, పూర్వభద్ర మొదటి పాదంలో రాహువు సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. రాహువు శతభిష నక్షత్రం నాలుగో పాదంలోకి వచ్చినప్పుడు, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొంద...