భారతదేశం, జనవరి 13 -- ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాబోయే వెబ్ సిరీస్ 'కల్ట్‌'ను జనవరి 17 నుండి ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ వెబ్‌సిరీస్ విడుదల చేయడాన్ని నిలిపివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వెబ్‌సిరీస్ అడ్డుకోవాలని కోరుతూ.. ఉత్తమ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రాథమిక వాదనలు విన్న తర్వాత సిప్లిగంజ్, నిర్మాతలు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. అయితే ఈ దశలో విడుదలను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. నిర్మాణ సంస్థ, ఇతర ప్రతివాదుల వాదనలు వినకుండా ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వడం కుదరదని తెలిపింది.

వెబ్ సిరీస్ నిర్మాత, దర్శకుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు ఉత్తమ్ వల్లూరి అనే వ్యక్తి. ఈ వ...