Telangana,hyderabad, జూలై 13 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కొత్త కార్డుల పంపిణీతో జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 95,56,625కి పెరగనుంది. ఈ కార్డుల ద్వారా 3,09,30,911 మంది లబ్ధిదారులు కానున్నారు. సోమవారం రోజు(జూలై 14) 5,61343 రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.

సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుండగా. అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్‌...