Telangana,hyderabad, సెప్టెంబర్ 27 -- తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. 23 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ను నియమించింది. ఇంటెలిజెన్స్‌ డీజీగా విజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు.

ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక పౌరసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా స్టీఫెన్‌ రవీంద్ర, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్ ను నియమించింది.

సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్ ను నియమించగా. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మను నియమితు...