భారతదేశం, జనవరి 29 -- రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని... రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్‌గా నిలిపేలా చూడాలని చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల్లోని హింటర్ ల్యాండ్‌ను ఏపీ పోర్టులు అన్నింటితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ...