Telangana,hyderabad, జూలై 4 -- గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వ్యాఖ్యానింతారు.

"నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నాం. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం. రాజకీయాల్లో మీ ఎ...