Tenali,andhrapradesh, జూన్ 3 -- రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వ్యవస్థలు అదుపు తప్పిపోతే.. పోలీసు వ్యవస్థ ఎలా దిగ జారి పోతుందో చెప్పడానికి తెనాలి ఘటన నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

రెడ్‌ బుక్‌ పాలనకు వ్యతిరేకంగా బుధవారం వెన్నుపోటు దినోత్సవంగా నిరసనలకు పిలుపునిచ్చారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘనలు పరిశీలిస్తే, చంద్రబాబు, టీడీపీ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని తెచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యంగానికి ఉపయోగపడుతూ పోలీస్‌ ...