Andhrapradesh,obgole, ఆగస్టు 7 -- ప్రధానమంత్రి మోదీ సుపరిపాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. ఒంగోలులో నిర్వహించిన చాయ్ పై చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారతదేశానికి తాత్కాలిక ఇబ్బంది కలిగినప్పటికీ... మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశ గొప్ప అభివృద్ధిని సాధిస్తుందని మాధవ్ చెప్పారు. ఎంతో ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని సమస్యలను ఎంతో చాకచక్యంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు. అమెరికా నుంచి భారతదేశానికి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

"చాయ్ పే చర్చ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజల సమస్యలను ఇలా తెలుసుకోవడం వల్ల పరిష్కరించడం కూడా ...