భారతదేశం, మే 23 -- ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో 22ను విడుదల చేసి ప్రక్రియను ప్రారంభించింది. తొలుత ప్రధానోపాధ్యాయులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి బదిలీలు చేపట్టనున్నారు. అయితే.. ఎస్‌జీటీలకు ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నతాధికారులు.. ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. ఎస్‌జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు.

కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం.. అన్నివర్గాల ఉపాధ్యాయులకు ఎస్‌జీటీలతో సహా ఆన్‌లైన్‌లో బదిలీలు చేపడతామని తెలియజేయడంతో గందరగోళం నెలకొంది. చర్చల సందర్బంగా ఆఫ్‌లైన్‌ అని చెప్పి, జీవోలో ఆన్‌లైన్‌లో బదిలీలు చేపడతామని చెప్పడం ఏంటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జీవోలో సవరణలు చేయాలని లేదా జిల్లా అధికారులకు బదిలీల విషయమై ఆదేశాలు ...