Telangana, మే 31 -- రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణ కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రూపొందించాలని చెప్పారు.

గోసంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, ద...