భారతదేశం, నవంబర్ 2 -- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే శిరీష, ఎండోమెంట్స్ కమిషనర్‌తో కలిసి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాలలో ఇకపై పూజలు జాగ్రత్తగా జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాలుగు నెలల క్రితమే కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభమైందన్నారు. దీనిని ప్రసిద్ధ తిరుమల ఆలయంలా కనిపించేలా రూపొందించారని చెప్పారు. ముందుగానే సంప్రదించి ఉంటే ఈ విషాదాన్ని నివారించేవారని అన్నారు.

'ఇది ఒక ప్రైవేట్ ఆలయం, దీనిని ప్రభుత్వం నేరుగా నియంత్రించదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సూచనలను అనుసరించి ప్రభుత్వం సంఘటన తర్వాత త్వరగా చర్య ...