భారతదేశం, జనవరి 4 -- సీనియర్ నటి రాశికి కోపమొచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్టు చేసిన ఆమె మండిపడ్డారు. అనసూయ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. శివాజీ, అనసూయ వివాదం అందరికీ తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్ లో రియాక్టవుతూ రాశి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో అనసూయ చేసిన కామెంట్లకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు రాశి.

గతంలో జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్లో అనసూయ వ్యాఖ్యలపై ఇప్పుడు రాశి ఫైర్ అయ్యారు. ఆ ఎపిసోడ్ లో అనసూయ 'రాశి గారి ఫలాలు' అనడంతో పాటు నవ్వేస్తుంది. అప్పుడు జడ్జీగా ఉన్న రోజా కూడా నవ్వుతుంది. ఈ కామెంట్ పై రాశి లేటెస్ట్ గా సీరియస్ అయ్యారు. శివాజీ ఇష్యూపై మాట్లాడుతూ రాశి గారి ఫలాలు అని ఓ మహిళ ఎలా అంటుందని విరుచుకుపడ్డారు.

''శివాజీ మాట్లాడింది 100 శాతం తప్పు అని అనను. కానీ కొన్ని మాటలు సరికాదు. ఆయనే రెండు, ...