Hyderabad, అక్టోబర్ 2 -- ప్రముఖ నటి, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ గురువారం (అక్టోబర్ 2) సోషల్ మీడియాలో చేసిన అసాధారణ దసరా పోస్ట్‌ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఆమె దసరా విషెస్ కాస్త భిన్నంగా ఉన్నాయి. రావణుడు రాక్షసుడు కాదని, కేవలం నాటీ అని ఆమె అనడం విశేషం. రావణుడిని ప్రశంసిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తన పోస్ట్‌లో భారత పురాణాలలో రావణుడిపై ఉన్న సుదీర్ఘ ద్వేషాన్ని సిమీ గరేవాల్ ప్రశ్నించారు. "ప్రియమైన రావణా.. ప్రతి సంవత్సరం ఈ రోజున మేము చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటాము.. కానీ టెక్నికల్‌గా మీ ప్రవర్తనను 'చెడు' నుండి 'కొంచెం అల్లరి'గా తిరిగి మార్చాలి. ఎందుకంటే అసలు నువ్వు ఏం చేశావు?"

"నువ్వు తొందరపాటులో ఒక మహిళను కిడ్నాప్ చేశావు. కానీ ఆ తర్వాత ఈ రోజుల్లో మనం మహిళలకు ఇచ్చే గౌరవం కంటే ఆమెకు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చావు. ఆమె...