భారతదేశం, మే 3 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో కూడా భారీ కస్టమర్ బేస్ ఉంది. దీని కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి నెలా భారీ అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025 నెలలో అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025లో మొత్తం 86,559 బైక్‌లను (దేశీయ అమ్మకాలు ప్లస్ ఎగుమతులు) విక్రయించింది. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో కేవలం 82,043 మాత్రమే. దీనితో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.
దేశీయ అమ్మకాలను మాత్రమే పరిశీలిస్తే ఏప్రిల్ 2025లో 76,002 బైక్‌లను విక్రయించింది. ఏప్రిల్ 2024తో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ అమ్మకాలలో 1 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే ఏప్రిల్ 2024లో దాదాపు అంతే సంఖ్యలో బైక్‌లను విక్రయించింది.
రాయల్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.