భారతదేశం, జనవరి 8 -- తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను జగన్ ప్రస్తావించారు. రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారని, ఈ ప్రాజెక్టును ఆపించామని అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ మీద వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు.

'రేవంత్‌తో చంద్రబాబుకు రహస్య ఒప్పందం కుదిరింది. రాయలసీమ లిఫ్ట్ సీమ...