భారతదేశం, మే 13 -- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ ఫిల్మ్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. 'రాపో22' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో రామ్, మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. ఉపేంద్రకు వెల్ కమ్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రాపో22 మూవీలో సూర్య కుమార్ క్యారెక్టర్ ను ఉపేంద్ర ప్లే చేస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. స్టోరీ ప్రకారం మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది. ''అందని వాడు.. అందరివాడు.. మన సూర్య కుమార్. మన సూపర్ స్టార్ ఉపేంద్రను సూర్య కుమార్ గా పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మేం ఆరాధించే సూపర్ స్టార్లు అందరికీ ఇది ఓ ట్రిబ్యూట్'' అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు.

రాపో 22 సినిమాను భారీ స్థాయిలో నిర్మిస...