భారతదేశం, డిసెంబర్ 3 -- ఇన్ని రోజులు హిట్ కష్టాలు పడ్డ రామ్ పోతినేనికి ఇప్పుడు మరో కష్టం వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మా స్టోరీనే అంటూ ప్రతి ఫ్యాన్ ఫీల్ అయ్యాడు. కానీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీసెంట్ గా మూవీ సక్సెస్ మీట్ లోనూ హీరో రామ్ పోతినేని ఇదే విషయంలో తన ఫీలింగ్స్ బయటపెట్టాడు.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. డిసెంబర్ 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాకు ఇటు సోషల్ మీడియాలో, అటు రివ్యూల్లో పాజిటివ్ టాక్ వినిపించింది. కానీ కలెక్షన్లు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి.

ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లు ఇండియాలో రూ.20 కోట్లకు కూడా చేరలేదు. అయిదు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా రూ.15.9 కోట్లు నెట్ వసూళ్లు మ...