భారతదేశం, నవంబర్ 9 -- టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న జోడీ పేరు.. భాగ్యశ్రీ బోర్సే, రామ్ పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది ఈ జంట. ఓ వైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా, మరోవైపు వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని గురించి భాగ్యశ్రీ చేసిన లేటెస్ట్ కామెంట్లు వైరల్ గా మారాయి.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన అప్ కమింగ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది టీమ్. ఈ క్రమంలోనే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి స్పెషల్ సెట్ లో శ్రీముఖికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే రామ్ డింపుల్స్ అంటే ఇష్టమని భాగ్యశ్రీ తెలిపింది.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర...