Hyderabad, మే 13 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ మరో అదిరిపోయే డాక్యుమెంటరీకి సిద్ధమవుతోంది. ఈ మధ్యే దర్శక ధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన ఆ ఓటీటీ.. ఇప్పుడు రామ్ చరణ్‌ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న పెద్ది మూవీ తెర వెనుక సీన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన క్రమంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోందని ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.

మగధీరతో తన కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్.. ఆర్ఆర్ఆర్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా...