భారతదేశం, మే 5 -- టాలీవుడ్ యంగ్ హీరో శ్రీలీల వరుసగా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో పుష్ప 2: ది రూల్ సినిమాలో అల్లు అర్జున్‍తో కలిసి స్పెషల్ సాంగ్ చేశారు. కిసిక్ పాటలో డ్యాన్స్ ఇరగదీశారు. ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. అయితే, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍తోనూ ఓ స్పెషల్ సాంగ్‍లో శ్రీలీల చిందేయనున్నారంటూ తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‍లో హాట్ టాపిక్ అయింది.

రామ్‍చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది చిత్రం చేస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి ఇప్పటికే హైప్ విపరీతంగా ఉంది. షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇటీవలే వచ్చిన పెద్ది గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్‍ కోసం శ్రీలీల పేరును మూవీ టీమ్ ఖరారు చేసిందనే రూమర్లు టాలీవుడ...