భారతదేశం, మే 11 -- టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగిన రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ గ్లోబల్ స్టార్ క్రేజ్ కు తగ్గ గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ తేజ్ మైనపు విగ్రహం కొలువుతీరింది. లండన్ లోని ఈ మ్యూజియంలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణకు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సహా ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యారు. రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లండన్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మెగా ఫ్యాన్స్ సందడి నెలకొంది. అభిమానులు పోస్టర్లు పట్టుకుని, డోలు వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. తన పెంపుడు కుక్క రైమ్ ను పట్టుకుని సోఫాలో కూర్చున్నట్లు రామ్ చరణ్ ఫొజుతో మైనపు బొమ్మను తయారు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మేడమ్ టుస్సాడ్స్ ...