భారతదేశం, నవంబర్ 8 -- తమిళంలో నీల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా కాంత. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నటుడు, డైరెక్టర్ సముద్రఖని, ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సేతోపాటు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇది.

కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నవంబర్ 14న తెలుగు, తమిళ, మలయాళ థియేటర్లలో కాంత విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా కాంత ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఎంతో ప్రేమ దొరికింది

డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. గత ఏడాదిగా రామానాయుడు స్టూడియో నా హోమ్‌గా మారింది. సినిమా మొత్తం హైదరాబాద్‌లో...