భారతదేశం, జూలై 4 -- రణ్‌బీర్ క‌పూర్‌, యష్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం మూవీ నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింప్స్ జూలై 3న విడుదలైంది. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్, బీజీఎం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్ క‌పూర్‌, రావణుడిగా యశ్ నట విశ్వరూపం ప్రదర్శించారని అంటున్నారు. ముఖ్యంగా రణ్‌బీర్ క‌పూర్‌ ను యశ్ డామినేట్ చేశారని చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి.

రామాయణం గ్లింప్స్ వచ్చిన వెంటనే ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్ మోత మోగుతోంది. ఎందుకంటే ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్.. యూట్యూబ్‌లో ఆ చిత్రం నుండి 'జై శ్రీరామ్' పాటను కూడా పంచుకుంది. దీని టైమింగ్ ఆన్‌లైన్‌లో విమర్శలను రేకెత్తిస్తోంది. 2023లో విడుదలైన ఆదిపురుష్ చిత్రాన్...