Hyderabad, జూలై 3 -- ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక ఇతిహాసం 'రామాయణం' సినిమా నుంచి మొదటి అధికారిక గ్లింప్స్‌ను (Ramayana First Glimpse) దర్శకుడు నమిత్ మల్హోత్రా విడుదల చేశాడు. రణబీర్ కపూర్, యశ్ రామరావణ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఈ ఎవర్ గ్రీన్ కథను వెండితెరపై ఎలా చూపిస్తారనే ఉత్సాహాన్ని మరింత పెంచాయి. 'ఆదిపురుష్' లాంటి చేదు అనుభవం తర్వాత, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.

గురువారం (జులై 3) నాడు, నమిత్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణం' సినిమా మొదటి గ్లింప్స్‌ను పంచుకున్నాడు. వీడియోను షేర్ చేస్తూ, అతడు ఇలా రాశాడు. "పదేళ్ల ఆశయం. ఎవర్‌గ్రీన్ గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచానికి తీసుకురావాలనే అకుంఠిత దీక్ష.

ర...