భారతదేశం, ఆగస్టు 5 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల పేరుతో ప్రపంచ దేశాల మీద పడుతున్నారు. ఇప్పటికే భారత్ మీద సుంకాలు పెంచుతామని బెదిరింపులు చేశారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించారు.

వచ్చే 24 గంటల్లో భారత్‌పై సుంకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రంప్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విశేషమేమిటంటే అమెరికా ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకాన్ని ప్రకటించింది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ అస్సలు సహించడం లేదు.

సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..'భారతదేశం మంచి వాణిజ్య భాగస్వామి కాదు, ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు, కానీ మేము వారితో వ్యాపారం చేయం. మేం 25 శాతం నిర్ణయించాం, కానీ రాబోయే 24 గంటల్లో ఈ రేటును గణనీయంగా పెంచబోతున్నానని నేను అనుకుంటున్నాను. వారు రష్...