భారతదేశం, అక్టోబర్ 13 -- సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొన్న రైతులు ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎన్నడూ మరువనని చెప్పారు.

'రైతుల అవస్థలు చూశాను. రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మెుదటగా సీఆర్డీఏ భవనం ప్రారంభమైంది. మెుదటిసారిగా ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.' అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని ఎక్కడ అన...