భారతదేశం, జనవరి 25 -- వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని మంత్రి తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో రాష్ట్ర డిస్కంల పనితీరుకు ఉన్నత రేటింగ్‌లు లభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని, అప్పుల ఊబిలో ముంచి డిస్కంలను నిర్వీర్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారి...