భారతదేశం, నవంబర్ 20 -- ఒకేసారి మూడు ప‌నులు చేస్తూ, నెలకు దాదాపు లక్ష రూపాయ‌లు సంపాదిస్తున్న ఒక రాపిడో (Rapido) డ్రైవ‌ర్ క‌థ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ యువ‌కుడి ప‌నితీరు చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ఒక ప్ర‌యాణికురాలు.. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో కాపీరైట‌ర్ కోమల్ పోర్వాల్ రాపిడో రైడ్‌లో ప్ర‌యాణిస్తున్నారు. ఆమె డ్రైవ‌ర్‌తో మాట క‌లిపి, ఆయ‌న పూర్తిస్థాయి ఉద్యోగం గురించి అడిగారు: "భ‌య్యా, మీరు పూర్తి సమ‌యం ఇదే ప‌ని చేస్తారా?" అని ప్రశ్నించారు.

సంతోషంగా, ఉల్లాసంగా ఉన్న ఆ డ్రైవ‌ర్ న‌వ్వి స‌మాధానం చెప్పాడు. ఆయ‌న ఉద‌యం స్విగ్గీ (Swiggy) డెలివ‌రీ భాగ‌స్వామిగా ప‌నిచేస్తారు. సాయంత్రం వేళ‌ల్లో రాపిడో న‌డుపుతారు. వారాంతాల్లో (వీకెండ్స్‌లో) త‌న సోద‌రుడితో క‌లిసి స్థానిక వీధిలో పానీ పూరి బండి న‌డుపుత...