Hyderabad, మే 6 -- రాను బొంబయికి రాను.. ఇదేమీ బ్లాక్‌బస్టర్ సినిమా పాట కాదు. పాడినోళ్లు, మ్యూజిక్ కంపోజ్ చేసినోళ్లు టాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీలు కాదు. కానీ ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 23న రిలీజైన ఈ సాంగ్.. ఇప్పటికీ 22 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ మ్యూజిక్ వీడియో ట్రెండింగ్ టాప్ 2లో ఉండటం విశేషం. మరి ఈ పాట విశేషాలు, లిరిక్స్ ఏంటో ఇక్కడ చూడండి.

రాను బొంబయికి రాను అనే ఆల్బమ్ నుంచే వచ్చిన పాట ఇది. రాము రాథోడ్ ఈ పాటకు లిరిక్స్ అందించడంతోపాటు మరో సింగర్ ప్రభతో కలిసి పాడాడు. కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించాడు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాట, అందులోని లిరిక్స్, డ్యాన్స్ స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

మూడున్నర నెలలుగా యూట్యూబ్ ను దున్నేస్తోందీ పాట. కేవలం రూ.5 లక్షల బడ్జెట్ తో రూపొందిన ...