Hyderabad, సెప్టెంబర్ 1 -- అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. అయితే మూవీ రిలీజ్ కు ముందు రానా దగ్గుబాటితో అనుష్క మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఈ బాహుబలి కోస్టార్స్ మాట్లాడిన తీరు అభిమానులకు బాగా నచ్చేసింది.

ఈ కాల్ మొత్తం రానాను అనుష్క బ్రో అని పిలవడం విశేషం. కాల్ మొదట్లోనే ఏంటీ సంగతులు.. క్రిష్ తో ఏదో యాక్షన్ సినిమా చేశావట కదా.. ఇలాంటి సినిమాలకు నిన్ను తప్ప ఇంకెవరిని పెడతారు అని రానా అంటాడు. అవును.. ఇందాకే నేను అన్నాను.. బాహుబలి, అరుంధతి తర్వాత ఇది కూడా అలాంటి పాత్రలే అని అనుష్క చెప్పింది. ఎందుకు తనకు అలాంటి పాత్రలే అని అడుగుతుంది. వయోలెంట్ మనుషులకు అలాంటి పాత్రలు ఇస్తే సొసైటీ తట్టుకోలేదు.. నీలాంటి మంచి వాళ్లకు ఇస్తే బాగుంటుంది అని రానా...