భారతదేశం, జూలై 22 -- ముంబైలో జరిగిన 'స్వదేశ్' స్టోర్ ప్రారంభోత్సవానికి అంబానీ కుటుంబానికి చెందిన కోడళ్లు, కుమార్తె హాజరయ్యారు. ఈ వేడుకలో రాధికా మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా మెహతా సంప్రదాయ దుస్తుల్లో తళతళా మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించారు.

ముఖ్యంగా భారతీయ సంప్రదాయ దుస్తులకు పెద్దపీట వేసిన ఈ కార్యక్రమంలో, అంబానీ మహిళలు తమ ఫ్యాషన్ అభిరుచిని మరోసారి చాటుకున్నారు. రాధికా మర్చంట్, ఇషా అంబానీ అద్భుతమైన చీరకట్టులో కనువిందు చేయగా, శ్లోకా మెహతా ఆకర్షణీయమైన ఎథ్నిక్ సూట్‌లో సందడి చేశారు. మరి వారి లుక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

రాధికా మర్చంట్ ఆరెంజ్ సిల్క్ చీరలో అచ్చంగా తెలుగు అమ్మాయిలా కనిపించారు. వెడల్పాటి బంగారు రంగు బోర్డర్ ఉన్న ఈ చీరను ఆమె సంప్రదాయ పద్ధతిలో కట్టుకున్నారు. పల్లు చక్కగా భుజంపై నుండి జారిపోతూ ఆమె అందాన్ని మరింత పెంచింది. దీనికి సర...