భారతదేశం, సెప్టెంబర్ 8 -- బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. 'వెపన్స్' మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. దర్శకుడు జాక్ క్రెగ్గర్ రూపొందించిన ఈ కొత్త హారర్ చిత్రం ఆడియన్స్ కు థ్రిల్ పంచింది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

హారర్ థ్రిల్లర్ మూవీ వెపన్స్ సెప్టెంబర్ 9, 2025 నుండి వీడియో ఆన్ డిమాండ్లో అందుబాటులో ఉంటుందని స్క్రీన్క్రాంట్ నివేదించింది. సినీ తారలు జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం వివిధ విఒడి ప్లాట్ ఫామ్స్ లోకి రానుంది. ఆపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, ఫాండాంగో ఎట్ హోమ్ (గతంలో వుడు) వంటి పలు ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 14న డీవీడీ, 4కే యూహెచ్ డీ, బ్లూ రేల్లో ఫిజికల్ మీడియా విడుదల చేయనున...