New Delhi, జూన్ 3 -- ఆధునిక జీవనశైలి అలవాట్లు.. ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసేవి దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేయగలవని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ కాంతి, ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతి కారణంగా మన శరీర అంతర్గత గడియారం (బయోలాజికల్ క్లాక్)కు అంతరాయం కలగడం అనేది అత్యంత నిర్లక్ష్యం చేస్తున్న ముప్పులలో ఒకటి అని చెబుతున్నారు. నిద్ర ఇప్పుడు ఐచ్ఛికం కాదు అది మీ శరీరం యొక్క ఉత్తమ క్యాన్సర్ వ్యతిరేక ఆయుధమని వైద్య నిపుణులు అంటున్నారు.

గువాహటిలోని అపోలో క్యాన్సర్ సెంటర్‌లో సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ కమలాసనన్ హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి వివరించారు.

"రాత్రి పొద్దుపోయే వరకూ నీలి కాంతికి గురికావడం వల్ల ఈ సమయం ఇంకా పగలే కావొచ్చనే భ్రమలో మెదడు ఉంటు...