Hyderabad, ఏప్రిల్ 24 -- చాలా మంది పగలంతా వేసుకున్న దుస్తులనే ధరించి రాత్రిపూట నిద్రపోతారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. నిద్ర పట్టాలంటే రాత్రి పూట కొన్ని రకాల దుస్తులు వేసుకోకూడదు.

మంచి నిద్ర కోసం, సౌకర్యవంతమైన మంచం మాత్రమే కాదు, సౌకర్యవంతమైన దుస్తులు కూడా అవసరం. అలాగే నిద్రపోయేటప్పుడు ధరించే దుస్తులు కూడా సౌకర్యవంతంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కొన్ని బట్టలు రాత్రిపూట ధరిస్తే నిద్రకు భంగం కలిగించడమే కాకుండా చర్మంపై దద్దుర్లు, దురద, రక్త ప్రసరణపై కూడా ప్రభావం చూపుతాయి. మంచి నిద్రతో పాటు మంచి ఆరోగ్యం కోసం పడుకునే ముందు కొన్ని రకాల దుస్తులు వేసుకోకూడదు.

రాత్రిపూట టైట్ టీ షర్టులు, లెగ్గింగ్స్ లేదా టైట్ ఇన్నర్ వేర్ వంటి బిగుతైన ఫిట్టింగ్ దుస్తులను ధరించి...