Hyderabad, మార్చి 28 -- ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు, కానీ నేటి జీవనశైలిలో ఫిట్ గా ఉండడం కష్టంగా మారిపోయింది. శారీరక శ్రమ తగ్గిపోయి ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం కామన్ అయిపోతోంది. అటువంటి పరిస్థితిలో, బరువు పెరగడం సహజం. ఇది అనేక వ్యాధులతో ముడిపడి ఉంటుంది. బరువు పెరగడం వల్ల అనేక జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బిజీ జీవితం కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. వాటిల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం.

ఉద్యోగాల వల్ల రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటివి చేస్తున్నారు. ఇది ఆరోగ్యంపై ఎన్నో చెడు ప్రభావాలను చూపుతుంది. చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతున్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి రాత్రి పూట భోజనం ఎప్పుడు తినకూడదో,...