భారతదేశం, నవంబర్ 19 -- మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'వారణాసి'. ఈ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్న రాజమౌళికి వరుస షాక్ లు తగులుతున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై వ్యాఖ్యలకు ఆయనపై పోలీసు కేసులు నమోదవుతుండగా, మరోవైపు వారణాసి టైటిల్ వివాదం కూడా తలనొప్పిగా మారింది.

ఆర్ఆర్ఆర్, బాహుబలి ఫ్రాంచైజీ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దేవుడిపై చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈ సంఘటన నవంబర్ 15న మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఆయన రాబోయే చిత్రం 'వారణాసి' మొదటి గ్లింప్స్ విడుదల సందర్భంగా జరిగింది. దీంతో ఆయనపై పోలీసు కేసులు నమోదయ్యాయి.

ఈవెంట్లో వారణాసి టీజర్ ప్రదర్శన సమయంలో స...