భారతదేశం, డిసెంబర్ 14 -- దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ తదితరుల పోరాటంతో వారికి ఓటు హక్కు వచ్చిందన్నారు. ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ మళ్లీ ఆ ఓట్లను లాగేసుకోవాలని చూస్తోందన్నారు.

'రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదలకు ఓటు హక్కు విషయంపై చర్చించే సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు వద్దని చెప్ప...