Telangana, జూన్ 2 -- తెలంగాణ రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ మంజూరు పత్రాల అందజేత ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం. నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయాల్సి ఉంది. రూ. లక్షలోపు యూనిట్లకు ముందుగా ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో శాంక్షన్ లెటర్ల అందజేత ప్రక్రియపై సర్కార్ వెనక్కి తగ్గింది.

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు భారీ దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి కలిపి 16.22 ల‌క్ష‌ల మంది అప్లికేషన్ చేసుకున్నారు. అనూహ్యమైన రీతిలో దరఖాస్తులు రావటంతో. దరఖాస్తుల పరిశీలన విషయంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలను చేపట్టింది. అన్ని కోణాల్లో దరఖాస్తుదారుడి వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది. విడతలవారీగా శాంక్షన్ లెటర్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా ర...