Telangana, ఏప్రిల్ 17 -- తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు అందాయి. అర్హతలకు తగ్గటుగా. అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి అధికారులు కొత్త అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తుదారులు వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ఆప్షన్ తీసుకువచ్చారు. ఇక్కడ దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి. వివరాలను తెలుసుకోవచ్చు.

ఏప్రిల్ 14వ తేదీతో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి.

ప...