భారతదేశం, మే 13 -- రాజీవ్ యువ వికాసం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, రుణాల మంజూరుపై చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసం అమలుపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవ్వగా.. వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించనున్నారు.

ఈ పథకం దరఖాస్తు ప్రక్రియలో అధికారులు కొన్ని సమస్యలను గుర్తించారు. వాటిని ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఉదాహరణకు.. గతంలో బీసీ కార్పోరేషన్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. అటు రేషన్ కార్డులు లేక చాలామంది దీనికి దరఖాస్తు చేసుకోలేదు. ఇటీవల సిబిల్ స్కోర్ అంశం తెరపైకి వచ్చింది. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఇవాళ్టి సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్...