భారతదేశం, మే 5 -- రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం.. దరఖాస్తుదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనార్టీలు దాదాపు 13.45 లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారా పథకానికి దరఖాస్తు చేశారు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో బీసీలవే ఎక్కువ ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా విభజించారు.

క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ అధికారులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాల మేరకు.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. యూనిట్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు.. మండల కమిటీలు, జిల్లా కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన దరఖాస్తులను.. మండల స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలి...