భారతదేశం, ఏప్రిల్ 18 -- రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా.. ఎక్కువమంది కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో.. కేటగిరీ 4 కోసం దరఖాస్తు చేశారు. మొత్తం 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఇందులో మూడో వంతు (76.46 శాతం) మంది రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరారు.

రూ.4 లక్షల విలువైన యూనిట్‌ విలువలో 70 శాతం రాయితీతో దాదాపు రూ.2.8 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ దరఖాస్తులు కేటగిరీ 4 లోనే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేటగిరీ 1 కింద వంద శాతం రాయితీతో ప్రభుత్వం రూ.50వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించింది. కానీ ఈ కేటగిరీలో దరఖాస్తులు కేవలం 39 వేలు మా...