భారతదేశం, మే 20 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్‌ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసి.. ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ పథకం కింద తొలిఏడాది 5 లక్షల మందికి మంజూ రుపత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిట్టు సమాచారం.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 సందర్భంగా మంజూరు పత్రాలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీమ్ అమలులో భాగంగా.. 3 నెలల్లో నెలకు రూ.2 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయనున్నారు. అంటే దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.

రాజీవ్ యువవికాసం పథకం కింద ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో ...