భారతదేశం, డిసెంబర్ 30 -- ఇప్పుడు ఎక్కడ చూసినా రాజాసాబ్ మేనియా కనిపిస్తోంది. ప్రి రిలీజ్ ఈవెంట్, రాజా సాబ్ 2.0 ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. జనవరి 9, 2026న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'రాజాసాబ్' 2026లో తొలి బిగ్ టికెట్ రిలీజ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం అమెరికాతో సహా ఎంపిక చేసిన విదేశీ ప్రాంతాల్లో ప్రీ-సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించింది. ఈ చిత్రం విదేశాలలో అద్భుతమైన ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

మేకర్స్ రీసెంట్ గా రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయమే ఉండగా.. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $ 200k దాటింది. అంటే రూ.2 కోట్లక...