భారతదేశం, డిసెంబర్ 22 -- వచ్చే నెలలో సంక్రాంతి సందర్భంగా 'ది రాజా సాబ్' విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. నెలల తరబడి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వ ప్రసాద్ అదిరే న్యూస్ చెప్పారు. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి అధికారికంగా స్పష్టత ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఇతర సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో రాజా సాబ్ ను పోల్చడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 'మాకు, అభిమానులకు నిజంగా ముఖ్యమైనది థియేట్రికల్ ఇంపాక్ట్' అని టీజీ విశ్వ ప్రసాద్ తన ఎక్స్ ఖాతాలో రాశారు. 'మా అతిపెద్ద సినిమా వ్యాపారం చుట్టూ చాలా సందడి ఉంది. అంతర్గత ఖర్చులు లేదా సంఖ్యలను మేము బహిరంగంగా చర్చించము. మాకు, అభిమానులకు నిజంగా ముఖ్యమైనది థియేట్రికల్ ఇంపాక్ట్'' అని విశ్వ ప్రసాద్ తెలిపారు.

''సినిమా ...