భారతదేశం, జనవరి 29 -- ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సలార్: పార్ట్ 1'కు సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్ 2' (Salaar 2) ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన 'ది రాజా సాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో, నిర్మాతలు 'సలార్ 2'ను నిరవధికంగా వాయిదా వేశారని ఒక ప్రముఖ పత్రిక రిపోర్ట్ చేసింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథను మార్చాలని దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ భావిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం.

సలార్ మూవీ సీక్వెల్ పక్కన పట్టలేదని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్.. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సినిమాలో 'ఆద్య' పాత్రలో నటించిన శృతి హాసన్ పుట్టినరోజును పురస్కరి...