భారతదేశం, జనవరి 22 -- ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసి ఘనంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అభిమానులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. చివరికి ఈ సినిమా ప్రభాస్ గత చిత్రాలైన 'ఆదిపురుష్', 'సాహో' వసూళ్లను కూడా దాటలేక ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా వైఫల్యంపై తనదైన శైలిలో స్పందించాడు.

ది రాజా సాబ్ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చడం వల్లే అసలు సమస్య వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డాడు. సుమన్ టీవీ విజయవాడతో అతడు మాట్లాడుతూ.. "నాకు తెలిసినంత వరకు రాజా సాబ్ సినిమాను మొదట తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఒక చిన్న, చక్కని సినిమాగా అనుకున్నారు. అం...