భారతదేశం, జనవరి 10 -- మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా సాబ్' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ముఖ్యంగా, ట్రైలర్‌లో చూపించిన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాలో లేకపోవడంపై అభిమానులు, విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మూవీ టీమ్ కొత్త సీన్లను రాజా సాబ్ చిత్రంలో యాడ్ చేసింది. ప్రభాస్ ఓల్డ్ లుక్ లో ఉన్న సీక్వెన్స్ అదిరిపోతుందని డైరెక్టర్ మారుతి చెప్పాడు.

శనివారం (జనవరి 10) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ సినిమా గురించి మాట్లాడుతూ, ప్రభాస్ పాత లుక్‌లో కనిపించే కొన్ని కొత్త సన్నివేశాలను రాజా సాబ్ లో చేర్చినట్లు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ కోసం ఫ్యాన్స్ వెతికారని డైరెక్టర్ మారుతి అన్నాడు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు యాడ్ చేశామని, అదిరి...