భారతదేశం, నవంబర్ 24 -- మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' నుంచి 'రెబెల్ సాంగ్' పేరుతో ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఆదివారం (నవంబర్ 23) రాత్రి ఈ సాంగ్ రిలీజైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే కూడా ఈ పాట సాంకేతిక కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా రిలీజైంది. ఈ పాటను పెద్ద తెరపై చూడటానికి హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 6.11 గంటలకు విడుదల కావాల్సిన పాట కొన్ని గంటలు ఆలస్యంగా విడుదలైంది.

'ది రాజా సాబ్' నుంచి 'రెబల్ సాంగ్' ఆదివారం సాయంత్రం విమల్ థియేటర్‌లో ఫస్ట్ రిలీజైంది. ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేశారు. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌ను సంజిత్ హెగ్డే, బ్లాజ్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్‌ను కుమార్ రచించారు. ఇందులో సంజిత...