భారతదేశం, జనవరి 8 -- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ పార్కుకు సంబంధించిన తన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆమె అన్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయ...